దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 172 పాయింట్లు పెరిగి 79,389 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి రూ.24,048 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఓఎన్జీసీ, టాటా స్టీల్, సిప్లా సంస్థల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.