కొత్త వైరస్‌పై ఆందోళన వద్దు: ఏపీ వైద్యారోగ్యశాఖ

79చూసినవారు
కొత్త వైరస్‌పై ఆందోళన వద్దు: ఏపీ వైద్యారోగ్యశాఖ
AP: చైనాలో విస్తరిస్తున్న కొత్త వైరస్(HMPV)పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పద్మావతి అన్నారు. ఏపీలో అలాంటి వైరస్ కేసులు నమోదు కాలేదని, ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని ఆమె చెప్పారు. ప్రజలు ఎక్కువగా సమూహంలో సంచరించవద్దని సూచించారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్