రామ్‌చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 10న మూవీ రిలీజ్ కానుండడంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య మాట్లాడారు. ఇందులో భాగంగా అకీరా నందన్‌తో ఖుషి 2 ఏమైనా ప్లాన్ చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఇప్పట్లో దర్శకత్వం గురించి ఏమీ ఆలోచించడం లేదు. ఒక వేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే అది జరుగుతుందేమో చూడాలి’ అని అన్నారు.