వాల్‌నట్స్ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. మెదడు పనితీరును పెంచుతుంది: వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.