నంద్యాల జిల్లా బనగానపల్లెలో తవ్వకాల్లో పురాతన శివాలయం బయటపడింది. ఎర్రమల అనే వ్యక్తి ఇంటిని నిర్మించే క్రమంలో పాత ఇంటిని పడగొట్టాడు. ఈ క్రమంలో ఇంటి శిథిలాల కింద పెద్ద గుంత కనబడింది. అందులో లోపలికి వెళ్లి చూడగా ఓ శివాలయం ఉంది. సమాచారం అందుకున్న పురావస్తు అధికారులు ఆ పురాతన దేవాలయాన్ని పరిశీలించారు.