కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటరుపై ఏకంగా రూ.4 పెంచుతున్నట్లు ప్రకటించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, రైతు సంఘాల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.44గా ఉన్న ఒక లీటరు నందిని పాల ప్యాకెట్ ధర రూ.48కి పెరగనుంది. పెరుగు ధర రూ.50 నుంచి రూ.54కి పెరుగుతుంది.