రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో భవనాలు, వంతెనలు కుప్పకూలిపోయాయి. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కూలిన భవనాల వద్ద అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.