'ఎంపురాన్' సినిమా నిర్మాత ఆస్తులపై ఈడీ రైడ్స్

64చూసినవారు
'ఎంపురాన్' సినిమా నిర్మాత ఆస్తులపై ఈడీ రైడ్స్
మలయాళం హీరో మోహన్ లాల్ 'ఎంపురాన్' సినిమా నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ ఆస్తులపై ఈడీ రైడ్స్ చేసింది. గోకులం చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కేరళలోని ఆఫీసుల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గోకులం గోపాలన్‌ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినీ రంగంలో పేరొందిన నిర్మాత మాత్రమే కాకుండా, దక్షిణాదిలో గోకులం గ్రూప్ పేరిట అనేక వ్యాపారాలు ఉన్న ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త.