భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక 2025కు చెందిన అత్యంత సంపన్న మహిళల జాబితాను రూపొందించగా సావిత్రి జిందాల్ దేశంలోనే రిచెస్ట్ ఉమెన్‌గా నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం సావిత్రి జిందాల్ ఆస్తుల విలువ సుమారు 35.5 బిలియన్ డాలర్లు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ తర్వాత సావిత్రి మూడో స్థానంలో నిలవడం విశేషం.