ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు

77చూసినవారు
ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఈ నెల 15న ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొనాలని సూచించాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరవుతారని తెలిపాయి.