జూన్ 14న 'ఎమర్జెన్సీ' విడుదల

575చూసినవారు
జూన్ 14న 'ఎమర్జెన్సీ' విడుదల
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్‌పై అప్ డేట్ ఇచ్చారు. జూన్ 14న థియటర్లలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇందీరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనున్నారు. కాగా గత ఏడాది నవంబర్ 24నే విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది.