ఏపీకి గుడ్ న్యూస్: ఈ జిల్లాల్లో జోరు వానలు

71చూసినవారు
ఏపీకి గుడ్ న్యూస్: ఈ జిల్లాల్లో జోరు వానలు
ఏపీలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తోన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతూ వస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది.

సంబంధిత పోస్ట్