జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

73చూసినవారు
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పట్నిటాప్‌లోని అకర్ ఫారెస్ట్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్