ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతం

70చూసినవారు
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో పోలీసు పోస్టుపై ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. వారి ఆచూకీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభీత్ జిల్లాలో లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు సోమవారం జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఖలిస్థానీ కమాండ్ ఫోర్స్‌కు చెందిన గుర్వీందర్ సింగ్, వీరేంద్ర సింగ్, జసన్‌ప్రీత్ సింగ్ మృతి చెందారు. ఆయుధాలతో వారు పురానాపూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి చేరుకుని ఎన్‌కౌంటర్ జరిపారు.

సంబంధిత పోస్ట్