సమాజంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు వచ్చాయి. అమ్మాయిలు కూడా వారికి నచ్చినట్టు ఉంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషించే రోజులు వచ్చాయి. అలాగే కొందరు కూతురిని ఇంటికి మహాలక్ష్మిగా భావించి.. ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆమెకు నచ్చిన పనిని చేయిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం పాతకాలపు కట్టుబాట్లను పాటిస్తూ కూతురిని భారంగా చూస్తున్నారు. కన్నామా ఏదోలాగ పెంచామా పెళ్లి చేసి అత్తారింటికి పంపించడంతో చేతులు దులుపుకుంటున్నారు.