డొనాల్డ్ ట్రంప్ హర్మీత్‌కు తన పాలకవర్గంలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. ఆమె భారత్‌లోని చండీగఢ్‌లో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. లా క్లర్క్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె 2006లో సొంతంగా ధిల్లాన్ లా గ్రూప్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది రిపబ్లికన్ జాతీయ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమెను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా ట్రంప్ నియమించారు