మల్టీరోల్ స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ యుద్ధ నౌక INS Tushil ఇవాళ జలప్రవేశం చేసింది. రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో ఆ నౌకను ఆవిష్కించారు. దీంతో ఇండియన్ నేవీలోకి మరో కొత్త యుద్ధనౌక వచ్చి చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. INS Tushil జలప్రవేశంతో ఏఐ, కౌంటర్ టెర్రరిజం లాంటి అంశాల్లో భారత్, రష్యా సహకారం కొత్త దశకు చేరుకోనున్నట్లు వెల్లడించారు.