శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే పలు నడుపుతున్న దక్షిమ మధ్య రైల్వే తాజాగా జనవరిలో ప్రత్యేకంగా 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. మౌలాలి టూ కొట్టాయం, హైదారాబాద్ నుంచి కొట్టాయం, కాచిగూడ నుంచి కొట్టాయం, కొట్టాయం టూ సికింద్రాబాద్, మౌలాలి నుంచి కొల్లం మధ్య జనవరి నుంచి ఫిబ్రవరి 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.