దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇందిరా పార్క్ వద్ద జరుగనున్న ఈ మహా ధర్నాకు బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 20 రోజుల నుంచి దివ్యాంగులు ఉద్యమం చేస్తున్నట్టు నాయకులు తెలిపారు.