రష్యాలో తయారైన అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్ఎస్ తుషీల్’ భారత నేవీ అమ్ములపొదిలోకి చేరింది. సోమవారం రష్యాలోని కాలినిన్ గ్రాడ్ నగరం వేదికగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఫ్రిగేట్‌ను భారత చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠికి లాంఛనంగా అప్పగించారు. భారత్‌లో ముంబై కేంద్రంగా పనిచేసే భారత నౌకాదళం పశ్చిమ విభాగానికి ఈ ఫ్రిగేట్‌ను అందిస్తారు. ఇది హిందూ మహాసముద్ర జలాల్లో మోహరించనున్నారు.