దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ కంపెనీకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. అందులో భాగంగా యూరప్‌కు చెందిన విమాన తయారీ కంపెనీ ఎయిర్‌బస్ నుంచి మరో 100 కొత్త విమానాలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఇందులో 90 నారో బాడీ A320 విమానాలు, 10 వైడ్ బాడీ A350 విమానాలు ఉన్నాయి. ఈ మేరకు ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదర్చుకున్నట్లు టాటా గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.