పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మినహాయింపులు

51చూసినవారు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మినహాయింపులు
* ఒక రాజకీయ పార్టీ మరొక పార్టీలో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన సభ్యులకు ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.
* ఒక రాజకీయ పార్టీకి చెందిన మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు వేరొక రాజకీయ పార్టీలోకి మారినప్పుడు వారికి కూడా ఈ చట్టం వర్తించదు.
* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, విధాన సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్‌ ఛైర్మన్, డిప్యూటీ ఛైౖర్మన్‌లు తమ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికీ ఈ చట్టం ప్రకారం అనర్హత వర్తించదు.