యాపిల్ ఐఫోన్ల ఎగుమతుల్లో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి ఏకంగా రూ.50,000 కోట్లకు పైగా విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసినట్లు సమాచారం. గతేడాది రూ.85 వేల కోట్ల విలువైన ఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గణనీయమైన వృద్ధి సాధించవచ్చని తెలుస్తోంది. 2030 నాటికి రూ.2.7 లక్షల కోట్లకు విక్రయాలు చేరుకోవచ్చని బ్లూమ్ బెర్గ్ సంస్థ అంచనా వేసింది.