అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. ఆకాశంలో విన్యాసం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎఫ్-35 కిందకు జారింది. విమానాశ్రయ రన్‌వేపై పడి పేలిపోయింది. ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. రన్‌వేపై కూలడంతో జెట్ పూర్తిగా ధ్వంసం కాగా, అందులో ఉన్న పైలెట్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.