ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

77చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడి సేలా పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ బైకును ప్రమాదవశాత్తు భారీ వేగంతో వస్తున్న డంపర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతులను దంపతులు ఉత్తమ్, దేవి.. వారి కుమారులు రాజ్(8), చింటూ(5) గా గుర్తించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you