యూపీలోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి లక్నో-మహ్మదాబాద్ రహదారిలోని ఇన్యాతాపూర్ గ్రామ సమీపంలో ఓ రిక్షా, రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్సా నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.