ICUలో తండ్రి.. ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న కూతుళ్లు! (వీడియో)

31892చూసినవారు
తండ్రి కొన ఊపిరితో ICU లో ఉండగా.. ఆయన కూతుళ్లు లక్నోలోని ఆస్పత్రిలో పెళ్లిచేసుకున్నారు. జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉండగా తండ్రి సూఫీ సయ్యద్ ఛాతీ ఇన్ఫెక్షన్తో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. తండ్రి పరిస్థితిని తెలుసుకున్న కూతుళ్లు డా.దర్శా, తాంజిలా ఆస్పత్రిలో పెళ్లిచేసుకునేందుకు ICUలో ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్