ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ - బీజాపూర్ సరిహద్దులో దంతెవాడ పోలీసులు ఆకస్మికంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు కంటపడడంతో పోలీసులు, మావోయిస్టులు మధ్య భీకరంగా ఎదురుకాల్పులకు కొనసాగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. మిగతా దళ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.