మహిళా అఘోరీపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు

73చూసినవారు
మహిళా అఘోరీపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు
గత నెల 18న మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ చేసిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో అఘోరీ తిరుగుతున్న సమయంలో ఆయన అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అఘోరీ తన కారులో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని విలేకరితోపాటు కార్ వాష్ సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విలేఖరి కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్