కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ సహించదు: వెంకటేశ్

64చూసినవారు
కొండా సురేఖ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ సహించదు: వెంకటేశ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'బాధ్య తాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు' అని X వేదికగా స్పందించారు.
Job Suitcase

Jobs near you