ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగర కేంద్రంలో నజఫ్‌గఢ్‌లోని ఫ్యాక్టరీలో శనివారం భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకన్న ఫైర్ సిబ్బంది 5 అగ్నిమాపక యాంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో.. వారిని చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.