థియేటర్‌లో అగ్ని ప్రమాదం.. ఛావా ప్రదర్శన నిలిపివేత

61చూసినవారు
థియేటర్‌లో అగ్ని ప్రమాదం.. ఛావా ప్రదర్శన నిలిపివేత
ఢిల్లీలోని ఓ సినిమా థియేటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రేక్షకులను సురక్షితంగా బయటకు పంపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. దీంతో ఛావా సినిమా ప్రదర్శనను నిలిపివేసి థియేటర్‌ను ఖాళీ చేయించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్