ప్రపంచంలో ఏఐ అసిస్టెడ్ IVF విధానంలో తొలి శిశువు జన్మించింది. మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్‌లో ఓ 40 ఏళ్ల మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఏఐ ద్వారా అండంలోకి స్పెర్మ్‌ను నేరుగా పంపే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI)కు బదులు ఆటోమేటెడ్ IVF సిస్టమ్‌ను వినియోగించారు. దీని ద్వారా మనిషి సాయం లేకుండానే 23 దశలు పూర్తైనట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ప్రక్రియకు 9 నిమిషాల 56 సెకన్ల సమయం పట్టిందని వారు చెప్పారు.