మధ్యప్రదేశలో జరిగిన హత్యకేసులో నిందితుడిని ఈగలు పట్టించాయి. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి రోజు మనోజ్ ఠాకూర్ (26), అతని మేనల్లుడు ధరమ్ సింగ్(19) ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే తర్వాతి రోజు ధరమ్ సింగ్ శవమై కనిపించాడు. పోలీసులు మన్నును అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా ఈగలు అతని చుట్టే తిరగడం ప్రారంభించాయి. దీంతో చొక్కాను పరీక్షలకు పంపగా డార్క్ కలర్ చొక్కాపై రక్తపు మరకలు బయటపడడంతో అరెస్ట్ చేశారు.