ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరగనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-1982 స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకోనున్నారు. లా అండ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసే ప్రతిపాదనలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు.