కుండపోత.. 28 మంది మృతి
By Shivakrishna 552చూసినవారురెండు రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడి, జలాశయాలు పొంగిపొర్లిన ఘటనలో 28 మంది మృతి చెందారు. హర్యానాలో పలు గ్రామలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జమ్మూకశ్మీర్ యంత్రాంగం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. రాజస్థాన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 16మంది చనిపోయారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో 8 మంది, హిమాచల్‌ప్రదేశ్‌లో ముగ్గురు బాలికలు, ఢిల్లీలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డారు.