10 లక్షల పూలతో ఫ్లవర్‌ షో (వీడియో)

73చూసినవారు
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో జనవరి మూడున ప్రారంభమై అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్లవర్ షో కోసం రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నైట్ ఫ్లవర్ పార్క్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో 54 లైటింగ్ డిస్‌ప్లేలు, జంతువుల బొమ్మలతో పాటు ఇతర ఇంటరాక్టివ్ ఫీచర్‌లున్నాయి.

సంబంధిత పోస్ట్