మరో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం

59చూసినవారు
మరో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఆసుపత్రిలో చేరారు. శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడ్డారు. దీంతో 12 రోజుల క్రితం ఆయనను కుటుంబ సభ్యులు వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :