భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా కాంబ్లీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్చించి చికిత్స ఇచ్చారు. తాజాగా మరోసారి అనారోగ్యానికి గురవడంతో ఆయనను ఆస్పత్రికి చేర్చారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.