రేషన్‌ కార్డుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరు!

55చూసినవారు
రేషన్‌ కార్డుల జాబితాలో మాజీ ఎమ్మెల్యే పేరు!
TG: వరంగల్‌(D) నల్లబెల్లి మండలంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ క్రమంలో రేషన్‌ కార్డుల జాబితాను పరిశీలించగా.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరుతో దరఖాస్తు(ఐడీ నెం.18608965) కనిపించింది. ఆ దరఖాస్తు  సుదర్శన్‌రెడ్డి ఇంటి నెంబరు 6-86, లెంకాలపల్లి రోడ్డు, నల్లబెల్లి పేరుతో ఉండడం విశేషం. ఈ దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసినట్లు తెలిసింది. సుదర్శన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావడంతో దరఖాస్తు తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.