రైలు ఢీకొని నలుగురు మృతి (వీడియో)

54చూసినవారు
రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారు. కేరళలోని పాలక్కడ్ జిల్లా శోరనుర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భరతపూజ నది వంతెనపై కార్మికులు నడుచుకుంటూ వెళుతుండగా కేరళ ఎక్స్‌ప్రెస్‌ రైలు వారిని ఢీకొట్టింది. మృతులు తమిళనాడుకు చెందిన వల్లి, రాణి, లక్ష్మణ్‌, మరో గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. ఒక మృతదేహం నదిలో పడిపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్