భారత మాజీ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్ట్ 15, 2020న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి ఇవాళ్టికి నాలుగేళ్లు. ఈ సందర్భంగా తన కెరీర్లోని వివిధ భాగాల చిత్రాలను చూపించే వీడియోను ధోనీ సోషల్ మీడియా పంచుకున్నారు. "మీ ప్రేమ, మద్దతుకు చాలా ధన్యవాదాలు." అని రాశారు. కాగా, 2004లో అరంగేట్రం చేసిన ధోనీ 332 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు.