భారత్లోని మహిళా ఉద్యోగులు డిజైన్, టెక్ సంబంధిత విభాగాల్లో అగ్రగాములుగా నిలవాలని ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఆకాంక్షిస్తోంది. కేవలం కొన్ని పనులకే పరిమితం కాకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటోందని కంపెనీ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు. ఆయన మహిళకు కల్పించనున్న అవకాశాల గురించి మీడియాతో ప్రస్తావించారు. ఉద్యోగ నియామకాల సమయంలో తమ కంపెనీ ఫాక్స్కాన్ లింగవివక్ష అస్సలు చూపదన్నారు.