నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సోమవారం మార్నింగ్ వాక్ లో భాగంగా
ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాకర్ లతో కలిసి వాకింగ్ చేశారు. వారితో కలిసి వ్యాయామం చేస్తూ, నియోజకవర్గంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగాల రోడ్డులోని టీ కొట్టు దగ్గరికి వెళ్లి టీ తాగుతూ అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్లి అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు.