వటువర్లపల్లిలో పోషణ అభియాన్ మాసోత్సవాలు

492చూసినవారు
వటువర్లపల్లిలో పోషణ అభియాన్ మాసోత్సవాలు
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వటువర్ల పల్లె గ్రామంలోని ఒకటవ అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని అచ్చంపేట సిడిపిఓ దమయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం భుజించాలని అన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఆకుకూరలు, కోడిగుడ్లు ఇతర పౌష్టిక ఆహారం వండి పెడతారని ప్రతి గర్భిణీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటే బలవర్ధకంగా ఉంటారని సుఖంగా కాన్పులు జరిగేలా ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. గ్రామంలోని 24 మంది గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసుకుంటారని వారికి అందజేయాలని అంగన్వాడీ టీచర్ శివ శరణమ్మకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సువర్ణ, డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you