గద్వాల జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కాలనీలో దీపావళి పండుగ ముందు 11, 800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సం.లు నిండిన ఆదివాసీ మహిళలకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడంతో చీరలు ఎలుకల పాలు కావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చీరలను పంపిణీ చేయాలని మహిళా సంఘాలు బుధవారం కోరుతున్నారు.