దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండల కేంద్రంలో బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొంటారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి లబ్దిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.