మహబూబ్ నగర్: రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ కులగణన

65చూసినవారు
ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం డ్రామాలకు తెరలేపిందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ బీసీలను మోసం చేయడానికే సర్వే అని, రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కులగణన చేపట్టిందని, కులగణనలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధంగా ప్రశ్నావళి రూపొందించారన్నారు. ప్రజల ఆస్తులను, ఎవరు ఏ రాజకీయ పార్టీ అనే వివరాలు సేకరించడం ఎందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్