మహబూబ్ నగర్: బాలల, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత

80చూసినవారు
బాలల, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోనప్ప గుట్టలో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రంతో పాటు షీ టీం భవనాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ప్రారంభించారు. పిల్లలు, మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్