తాను ఎప్పుడూ ప్రజలకు అండగా నిలబడతానని, అవసరమైతే ప్రజల కోసం ప్రభుత్వంపై తిరగబడతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం జడ్చర్ల మండలం ఉదండాపూర్ భూ నిర్వాసిత రైతుల, గ్రామస్తుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఉదండాపూర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇచ్చే పరిహారం పెంచకపోతే ఒప్పుకొనే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రభుత్వంపై తిరగబడటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.